యువ నటుడు రాహుల్ బెనర్జీ కన్నుమూత
కలకత్తా, 30 మార్చి (హి.స.)బెంగాలీ యువ నటుడు రాహుల్ బెనర్జీ (43) అకాల మరణం చెందారు. సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా-పశ్చిమ బెంగాల్ సరిహద్దుకు సమీపంలోని తల్సారి బీచ్‌లో ఈ విషాద ఘటన జరిగింది. బెంగాల్ టీవీ సీరియల్ ‘‘భోలే బాబా పర్ కరేగా’’ (
Rahul


కలకత్తా, 30 మార్చి (హి.స.)బెంగాలీ యువ నటుడు రాహుల్ బెనర్జీ (43) అకాల మరణం చెందారు. సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా-పశ్చిమ బెంగాల్ సరిహద్దుకు సమీపంలోని తల్సారి బీచ్‌లో ఈ విషాద ఘటన జరిగింది.

బెంగాల్ టీవీ సీరియల్ ‘‘భోలే బాబా పర్ కరేగా’’ (Bhole Baba Par Karega) షూటింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. షూటింగ్ ముగిసిన తర్వాత రాహుల్ బెనర్జీ ఒంటరిగా సముద్రంలోకి వెళ్లారు. అయితే భారీ అలలు కారణంగా సముద్రంలోకి వెళ్లిపోయారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. కొద్దిసేపటికే కనిపించకపోవడంతో యూనిట్ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే సహనటులు, సాంకేతిక నిపుణులు గమనించి నీటిలోంచి బయటకు తీశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటినా దీఘా ఆస్పత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం 6:10 గంటలకు రాహుల్ బెనర్జీ చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande