మరింతగా ముదిరిన యుద్ధం.. ఇస్ఫహాన్ నగరం లక్ష్యంగా.. ఇరాన్పై అమెరికా భారీ దాడి
న్యూఢిల్లీ, 31 మార్చి (హి.స.) పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదిరాయి. ఇరాన్లోని వ్యూహాత్మక నగరం ఇస్ఫహాన్ (Isfahan) లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భారీ వైమానిక దాడులు(900-kg Bunker Buster Bomb) జరిపాయి. ఈ దాడుల వల్ల ఇస్పహాన్ నగరంలో వరుసగా
War


న్యూఢిల్లీ, 31 మార్చి (హి.స.)

పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు

మరింత ముదిరాయి. ఇరాన్లోని వ్యూహాత్మక నగరం ఇస్ఫహాన్ (Isfahan) లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భారీ వైమానిక దాడులు(900-kg Bunker Buster Bomb) జరిపాయి. ఈ దాడుల వల్ల ఇస్పహాన్ నగరంలో వరుసగా భారీ పేలుళ్లు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇరాన్ అణు కేంద్రాలు, ప్రధాన సైనిక స్థావరాలు ఉన్న ఇస్ఫహాన్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులకు సంబంధించిన ఒక వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేశారు. అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో వెనకడుగు వేయదని ఈ చర్య ద్వారా ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ తన వైమానిక శక్తిని ఉపయోగించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గతంలో ఇరాన్ చేసిన దాడులకు ప్రతిచర్యగానే ఈ దాడిని భావిస్తున్నారు.

దాడుల తీవ్రతపై ఇరాన్ అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే, తమ గగనతలంపైకి వచ్చిన డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. ఈ దాడులతో అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందన్న భయంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నాయి. శాంతి చర్చల ప్రతిపాదనలు ఒకవైపు సాగుతుండగానే, మరోవైపు ఈ స్థాయి దాడులు జరగడం పశ్చిమ ఎంత ఉద్రిక్తంగా ఉందో ఆసియాలో పరిస్థితి తెలియజేస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande