
హైదరాబాద్, 05 మార్చి (హి.స.)
నేపాల్ దేశంలో 2026 సాధారణ
ఎన్నికలకు పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభం అయింది. జెన్ జెడ్ ఉద్యమం (Gen Z movement) తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఖాట్మండులోని అన్నపూర్ణ వినాయక్ స్కూల్ పోలింగ్ సెంటర్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది పోల్ ప్రిపరేషన్లను ముగించి, ఓటర్ల రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది.
ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనేందుకు ఓటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీ భద్రత (Massive security) ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలు నేపాల్ భవిష్యత్తు (future of Nepal) 2 నిర్ణయించడంలో అత్యంత కీలకం కానున్నాయి. ఇటీవల రాష్ట్రంలో జరిగిన భారీ నిరసనలు, జెన్ జెడ్ ఉద్యమం తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అలాగే పోలింగ్ సందర్భంగా ఎటువంటి అల్లర్లు సంభవించకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఈ మధ్యాహ్నం నేపాల్ మాజీ ప్రధాని (Nepal Ex PM) కేపీ శర్మ ఓలి (KP Sharma Oli) ఓటువేశారు.
భక్తాపూర్ లోని ఓ పోలింగ్ స్టేషన్లో ఓలి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ - యూనిఫైడ్ మార్క్సిస్ట్, లెనినిస్ట్ (CPN-UML) తరఫున ఆయన ప్రధాని అభ్యర్థిగా రేసులో ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..