ట్రంప్ సర్కార్కు ఎదురుదెబ్బ.. టారిఫ్లు వెనక్కి ఇచ్చేయాలని కోర్టు ఆదేశం
ఢిల్లీ, 05 మార్చి (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వానికి న్యాయస్థానంలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ప్రభుత్వం విధించిన దిగుమతి సుంకాలను (Tariffs) సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, ఆ నిబంధనల ప్రకారం
Trum


ఢిల్లీ, 05 మార్చి (హి.స.)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

(Donald Trump) ప్రభుత్వానికి న్యాయస్థానంలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ప్రభుత్వం విధించిన దిగుమతి సుంకాలను (Tariffs) సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, ఆ నిబంధనల ప్రకారం ఆయా కంపెనీల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని (Refund) తాజాగా ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. అయితే, ట్రంప్ ప్రభుత్వం తన వాణిజ్య విధానాల్లో భాగంగా చైనా (China), ఇండియా (India)తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా టారిఫ్లను విధించింది. అయితే, ఈ సుంకాల విధింపు పద్ధతి రాజ్యాంగబద్ధంగా లేదని, సరైన విధివిధానాలు పాటించలేదని గతంలోనే అమెరికా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని అనేక కంపెనీలు తాము చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

ఈ ఫిర్యాదులపై విచారణ జరిపిన ఫెడరల్ కోర్టు నిబంధనలకు విరు విరుద్ధంగా వసూలు చేసిన టారిఫ్లను కంపెనీలకు రీఫండ్ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు వల్ల అమెరికా ఖజానాపై బిలియన్ల కొద్దీ డాలర్ల భారం పడే అవకాశం ఉంది. ఓ వైపు అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం, మరోవైపు ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ నిధుల చెల్లింపు ట్రంప్ యంత్రాంగానికి పెద్ద చిక్కుగా మారింది. కానీ, దేశీయ పరిశ్రమలను రక్షించడానికే ఈ సుంకాలు విధించామని ప్రభుత్వం వాదించినప్పటికీ, చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించలేదన్న పాయింట్తో కోర్టు ఏకీభవించ లేదు. ఈ రీఫండ్ ప్రక్రియ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande