
అమరావతి, 10 ఏప్రిల్ (హి.స.)
ఆనందపురం: విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో గూగుల్ డేటా సెంటర్కు కేటాయించిన భూముల్లో పరిహారం కింద ఇస్తామన్న మూడు సెంట్లు భూమికి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయలేదని పేర్కొంటూ భూములు కోల్పోయిన రైతుల ఆందోళన కొనసాగుతోంది. గురువారం సాయంత్రం ఆనందపురం తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ వాసు నాయుడు రైతులతో మాట్లాడినప్పటికీ పరిస్థితి అలాగే ఉంది.
రెండు రోజుల క్రితం అక్కడ పర్యటించిన జిల్లా కలెక్టర్.. పరిహారం రాదని అనటంతో రైతులు ఆందోళనకు దిగారు. జిల్లా ఉన్నతాధికారి స్వయంగా అలా చెప్పడంతో ప్రభుత్వం ప్రకటించిన మూడు సెంట్ల భూమికి సంబంధించి 621 మంది రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు గూగుల్ డేటాసెంటర్కు సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులను జరగనివ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. ప్రస్తుతం పోలీసుల బందోబస్తు మధ్య ఆందోళన జరుగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ