'ఆయుష్ సేవలు సద్వినియోగపర్చుకోవాలి': జిల్లా కలెక్టర్ కే హైమావతి
ఆయుష్ సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ అన్నారు
Collector


సిద్దిపేట, 10 ఏప్రిల్ (హి.స.)

ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి వైద్య సేవలను ప్రజలు సద్వినియోగ పరచుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఉచిత ఆయుష్ మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి వైద్య సేవలతో పాటుగా ఉచితంగా మందులు అందించడం జరుగుతుందన్నారు. వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఆయుష్ కేంద్రంలో వైద్యం సేవలు పొందాలని సూచించారు. ఆయుష్ వైద్యశాలలో భవిష్యత్ లో అవసరం ఉన్నవారికి సర్జరీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతకు ముందు ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి ఓపి వార్డులు మెడిసిన్ పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande