తుంగతుర్తిలో పూర్వ ప్రాథమిక విద్య ఏర్పాటు చేయాలి
పూర్వ ప్రాథమిక విద్య ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేత
తుంగతుర్తిలో పూర్వ ప్రాథమిక విద్య ఏర్పాటు చేయాలి


తుంగతుర్తి, 10 ఏప్రిల్ (హి.స.)

తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలన్ను కోరుతూ అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల ప్రవీణ్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నారం గ్రామంలో ఐదు అంగన్వాడీ కేంద్రాలు, రెండు ప్రాథమిక పాఠశాలలో ఒకటి ఎంపీపీఎస్ పాఠశాల ఉన్నాయని అందులో నర్సరీ, ఎల్ కే జీ, యూకేజీ కోర్సులు అందుబాటులో లేకపోవడంతో 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంగతుర్తికి వెళ్లి వేల రూపాయల ఫీజులు వెచ్చించి విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు స్పందించి విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ప్రభుత్వ పాఠశాలలోనే పూర్వ ప్రాథమిక విద్యను ఏర్పాటు చేయాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande