
హైదరాబాద్, 10 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టులకు చెందిన కీలక నాయకులతో సహ మొత్తం 42 మంది మావోయిస్టులు ( Maoists Surrender) లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ( DGP Shivadar Reddy ) సమక్షంలో 36 ఆయుధాలు, 800 గ్రాముల బంగారంతో లొంగిపోయారని పోలీసులు ప్రకటించారు. వీరంతా చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన వారని వెల్లడించారు
పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్, డీకేఎస్జెడ్సీ సభ్యుడు సోడి మల్ల ఎలియాస్ కేషాల్, జేఎంఎండబ్ల్యూసీ డివిజనల్ కమిటీ కార్యదర్శి చాప నారాయణ అలియాస్ గజేందర్, బీకే ఎఎస్ఆర్ డివిజనల్ కమిటీ సభ్యుడు కడ్తి సన్నుతో లొంగిపోయారు. ఐదు ఏకే-47 రైఫిళ్లు, నాలుగు ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, మూడు ఇన్సాస్ రైఫిళ్లు, ఆరు 303 రైఫిళ్లు, ఒక 9ఎంఎం స్టెన్ గన్, రెండు 8 ఎంఎం రైఫిళ్లు, పది సింగిల్ షాట్ గన్స్, ఒక 9 ఎంఎం పిస్టల్, రెండు రివాల్వర్లు, 1007 తూటాలు, 800 గ్రాముల బంగారాన్ని పోలీసులకు అప్పగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi