
నెల్లూరు, 11 ఏప్రిల్ (హి.స.)
,వైసీపీ ముఖ్య నేతలపై నెల్లూరులో కేసులు నమోదు అయ్యాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి యత్నం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, శాంతి భధ్రతలకు విఘాతం కల్పించారంటూ వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులుగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన కుమార్తె పూజితా రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైసీపీ నేత వెంకటశేషయ్య, వైసీపీ శ్రేణులు ఉన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను(ABN Andhrajyothy MD Radhakrishn) మాజీ మంత్రి కాకాణి తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు.
దమ్ము, ధైర్యం ఉంటే, మగాళ్లు అయితే బారికేడ్లు దాటి రావాలంటూ కాకాణి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసులను దుర్భాషలాడుతూ, నెట్టేస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతల తీరుపై ఆంధ్రజ్యోతి బీఎం కె.హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 189(2), 126(2), 79, 351(2) R/W 190 కింద కేసులు నమోదయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ