
హైదరాబాద్, 11 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో అక్రమ ఫీజుల వసూళ్లపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మొత్తం ఫీజును నాలుగున్నర సంవత్సరాలకే పరిమితం చేయాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లుగా వసూలు చేస్తున్నట్లు భావించి అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో అక్రమ ఫీజుల వసూళ్లపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మొత్తం ఫీజును నాలుగున్నర సంవత్సరాలకే పరిమితం చేయాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లుగా వసూలు చేస్తున్నట్లు భావించి అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చిరంచింది. కోర్సు వ్యవధి 4.5 సంవత్సరాలే అయినప్పటికీ, విద్యార్థులపై భారం తగ్గించే ఉద్దేశంతో ఫీజును ఐదు విడతలుగా మాత్రమే వసూలు చేయాలని యూనివర్సిటీ సూచించింది
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi