ఫులే ఆశయ సాధనకు కృషి చేయాలి
నిడమనూరులో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు జరిగాయి
ఫులే ఆశయ సాధనకు కృషి చేయాలి


నిడమనూరు, 11 ఏప్రిల్ (హి.స.)

సామజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. జ్యోతి రావు పూలే 200వ జయంతి సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామజిక చైతన్యం కోసం పూలే చేసిన సేవలు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి తోట చందర్ రావు, నాయకులు కొండా శ్రీనివాస్ రెడ్డి, శేషరాజు శ్రీనివాస్, విశ్వనాధుల రమేశ్, మెరుగు మధు, శేషరాజు లక్ష్మినరేష్ దాసు, మేరెడ్డి వెంకటరమణ, మన్నెం శంకర్, కామ్మాల శ్రీను, గాయకవాడ లక్ష్మినారాయణ, మోర శంకర్ పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande