ఐటీ.శాఖ మంత్రి. నారా లోకేష్ సోమవారం రాష్ట్రపతిని..కలవనున్నారు
అమరావతి, 11 ఏప్రిల్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఇటీవల పూర్తి చట్టబద్ధత లభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్రతో అమరావతి రైతులు, ఏపీ ప్రజల కల నెరవేరింది. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా ఆంధ్ర
ఐటీ.శాఖ మంత్రి. నారా లోకేష్ సోమవారం రాష్ట్రపతిని..కలవనున్నారు


అమరావతి, 11 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఇటీవల పూర్తి చట్టబద్ధత లభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్రతో అమరావతి రైతులు, ఏపీ ప్రజల కల నెరవేరింది. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతిని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు కలవనున్నారు. సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ముర్ముతో భేటీ కానున్నారు. రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఆమోదం తెలపడంపై ఏపీ ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్పనున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ఆమెకు అమరావతి విశిష్టతలు తెలియజేసే బుక్ లెట్ను

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande