కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ వద్ద .ఘోర రోడ్డు ప్రమాదం
అమరావతి, 11 ఏప్రిల్ (హి.స.) కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ కారుపై సిమెంట్ ప్లయాస్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు.. టోల్ కట్టేందుకు ప్లాజా వద్ద ఆగింది. వేగంగా
కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ వద్ద .ఘోర రోడ్డు ప్రమాదం


అమరావతి, 11 ఏప్రిల్ (హి.స.)

కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ కారుపై సిమెంట్ ప్లయాస్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు.. టోల్ కట్టేందుకు ప్లాజా వద్ద ఆగింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి దానిపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్కు చెందిన ఏపీ, తెలంగాణ హైకోర్టుల సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు మృతిచెందారు.

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన టోల్ గేట్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మూడు జేసీబీల సహాయంతో అతి కష్టంగా మీద లారీని పైకి లేపారు. ప్రమాద సమయంలో కారులో శ్రీనివాసరావు ఒక్కరే ఉన్నారని, ఆయనే డ్రైవ్ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. శనివారం కావడంతో రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉంది. కాగా, వాహనాలు ప్రస్తుతం ఒకవైపు మాత్రమే నడుస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande