నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెట్ (TET) నోటిఫికేషన్ విడుదల
విడుదలైన టెట్ నోటిఫికేషన్
Tet


హైదరాబాద్, 13 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగఉపాధ్యాయ అభ్యర్థులకు విద్యాశాఖ నుంచి గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం, ఈ నెల (ఏప్రిల్) 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ఏడాదిలో ఇది రెండో టెట్ నోటిఫికేషన్ కావడంతో, డీఎస్సీ (DSC) కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం గా మారనుంది.

తక్కువ సమయం ఉన్నందున అభ్యర్థులు అప్రమత్తమై దరఖాస్తు ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం, జూన్ నెలలో టెట్ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ల జారీ, ఇతర సాంకేతిక అంశాలపై విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. దీంతో అభ్యర్థులు సిలబస్ను సరిచూసుకుని, జూన్లో జరిగే పరీక్షలకు సిద్ధం కావాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande