ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు..
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం
మంత్రి  పొన్నం


హైదరాబాద్, 13 ఏప్రిల్ (హి.స.)

ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, సమ్మె అంశంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. విలీనం అంశం కమిటీ దగ్గర ఉందని, సమ్మె విషయంలో రెండు సమస్యలపై మినహా మిగతా అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సిబ్బందికి సంబంధించిన పరిస్కరిస్తామని, ప్రేరేపిత సమ్మెలకు వెళ్ళవద్దని ఆర్టీసీ కార్మికులను కోరారు. పెండింగ్ డీఏ (DA) ఇచ్చామి పీఆర్సీ(PRC)పై ఆలోచన చేస్తున్నామన్నారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ ను అధికారులతో కలిసి మంత్రి నేడు విడుదల చేశారు.

13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రోడ్ సేఫ్టీ కోసం పోలీస్, రవాణా శాఖ అరైవ్ (arrive) - అలైవ్(alive) కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి పొన్నం చెప్పారు. రవాణా నిబంధనలు, ప్రమాదాలకు కారణాలు చర్చించి, వాటిని తగ్గించే చర్యలు తీసుకోవడానికి కార్యక్రమం చేపట్టామన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం రవాణా శాఖ చర్యలు తీసుకుంటుందని ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 6 రోజుల్లో అన్ని జిల్లాల్లో శాఖ పరంగా సమీక్షలు చేసుకుంటామని చెప్పారు. ప్రమాదాల నివారణ, ప్రాణ నష్టం లేకుండా చూడటమే కార్యక్రమం లక్ష్యం అని యాక్సిడెంట్ అయిన గంటలో గోల్డెన్ అవర్లో బాధితులను ఆస్పత్రిలో చేర్పిస్తే రహవీర్ అవార్డ్ తో సత్కరిస్తున్నామన్నారు.

రవాణా నిబంధనలు చెక్ పోస్టులు ఎత్తివేసి సంస్కరణలు తీసుకొచ్చామని పొన్నం చెప్పారు. అన్ని స్కూళ్ళలో విద్యార్థులకు వివరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీలో 30 ఏళ్ల సర్వీసులో ఉండి, ఒక్క యాక్సిడెంట్ కూడా చేయని వారికి సన్మానం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రోడ్ సేఫ్టీ సమావేశాలు ప్రతీ జిల్లాలో నిర్వహించాలని ఈ సందర్భంగా ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande