
మేడ్చల్ మల్కాజ్గిరి, 13 ఏప్రిల్ (హి.స.) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎద్దుల అక్రమ రవాణా ఘటన సోమవారం ఉదయం వెలుగుచూసింది. నిజామాబాద్ నుంచి నగరానికి వెళ్తున్న కంటైనర్ వాహనంలో ఎద్దులను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గోరక్షతల సభ్యులు అప్రమత్తమయ్యారు. బస్ డిపో ఎదుట RJ 52 GA 3550 నంబర్ గల కంటైనర్ను అడ్డుకుని పరిశీలించగా అందులో సుమారు 28 ఎద్దులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే మేడ్చల్ పోలీసులకు సమాచారం ఇచ్చి వాహనాన్ని అప్పగించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కంటైనర్ను స్వాధీనం చేసుకుని ఎద్దులను రక్షించారు. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రక్షించిన ఎద్దులను గోశాలకు తరలించి సంరక్షణ చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు