తుని గ్రామీణ మండలం లోని తేటగుంట సమీపంలో డీజల్ వ్యాన్ బోల్తా
వ్యాన్ బోల్తా...ఆయిల్ పట్టుకునేందుకు పోటీపడ్డ స్థానికులు
తుని గ్రామీణ మండలం లోని తేటగుంట సమీపంలో డీజల్ వ్యాన్ బోల్తా


తుని, 15 ఏప్రిల్ (హి.స.)

గ్రామీణ మండలంలోని తేటగుంట సమీపంలో డీజిల్ వ్యాన్ బోల్తాపడటంతో స్థానికులు అయిల్ పట్టుకునేందుకు పోటీ పడ్డారు. వ అన్నవరం నుంచి రేఖవానిపాలెం సమీపంలో పోలవరం కాలువ పనులు చేస్తున్న వాహనాలకు అయిల్ నింపేందుకు సుమారు 2,500 లీటర్లను తీసుకెళుతున్న వాహనం బోల్తాపడటంతో స్థానికులు నేలపాలవుతున్న ఆయిల్ను డబ్బాల్లో పట్టుకొనేందుకు పోటీపడ్డారు. దీంతో కొద్ది సమయం ట్రాఫిక్ నిలిచింది. సమాచారం తెలియగానే ఎస్సై కృష్ణామాచారి, హైవే అంబులెన్సు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను నియంత్రించారు. క్రేన్ సహాయంతో రోడ్డుపై బోల్తాపడిన వ్యానును తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande