
అమరావతి, 15 ఏప్రిల్ (హి.స.)
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి (సీపీఆర్వో) పి.శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసానికి వెళ్తున్న ఆయన్ని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు రక్తచరిత్ర అంటూ కత్తి పట్టినట్లు ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో శ్రీహరి పోస్ట్ చేశారు. దీనిపై చిత్తూరులో కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీహరి ప్రస్తుతం వైసీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ, వైఎస్సార్ సీపీ పార్టీల మధ్య ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తత వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ