సూర్యాపేట జిల్లాలో కలకలం: కలెక్టర్, ఎస్పీ ముందే మహిళ ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట, 16 ఏప్రిల్ (హి.స.) ఉన్నతాధికారుల సమక్షంలోనే ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సూర్యాపేట (Suryapet) జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో తనకు అన్యాయం జరిగిందన్న ఆవేదనతో ఆ మహిళ పురుగుల మందు తాగింది. వివరాల్లోకి వ
సూర్యాపేట క్రైo


సూర్యాపేట, 16 ఏప్రిల్ (హి.స.)

ఉన్నతాధికారుల సమక్షంలోనే ఓ

మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సూర్యాపేట (Suryapet) జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో తనకు అన్యాయం జరిగిందన్న ఆవేదనతో ఆ మహిళ పురుగుల మందు తాగింది. వివరాల్లోకి వెళితే.. మునగాల (Munagala) మండల పరిధిలోని తాడువాయి (Taduvayi) గ్రామానికి చెందిన కోట సునీత (Sunitha) అనే మహిళ, ఇందిరమ్మ కాలనీ ఇళ్ల పంపిణీలో తనకు ఇల్లు కేటాయించలేదని గత కొంతకాలంగా ఆవేదన చెందుతోంది. తనకు ఇల్లు రాకుండా స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపిస్తోంది. మునగాల మండల కేంద్రంలో గురువారం 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత వేదిక వద్దకు వెళ్లి తన గోడును వెళ్లబోసుకునే ప్రయత్నం చేసింది. అధికారులకు తన సమస్యను వివరిస్తూనే, వెంట తెచ్చుకున్న పురుగుల మందును ఒక్కసారిగా కలెక్టర్, ఎస్పీ ముందే తాగేసింది.

ఈ హఠాత్పరిణామంతో షాక్కు గురైన పోలీసులు, అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. స్పృహ కోల్పోతున్న సునీతను వెంటనే పోలీసు వాహనంలో కోదాడ (Kodad) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అత్యవసర చికిత్స అందుతోంది. రాజకీయ అండదండలు ఉన్నవారికే సంక్షేమ పథకాలు కట్టబెడుతున్నారని, అర్హులైన తమలాంటి వారికి అన్యాయం చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయ నాయకుల ఒత్తిడితో అధికారులు తనకు రావాల్సిన ఇల్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande