మహిళల ఆరోగ్యమే.. సమాజ ఆరోగ్యం : వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద
మహిళల ఆరోగ్యమే.. సమాజ ఆరోగ్యం
కలెక్టర్


వరంగల్, 16 ఏప్రిల్ (హి.స.)

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు

ఆరోగ్యంగా ఉంటుందని, అదే విధంగా సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, వివిధ శాఖల అధికారులతో, మండల సర్పంచులతో కొనయమాకుల రైతు వేదికలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సత్య శారద పాల్గొని మాట్లాడారు. సమాజం బాగుండాలంటే విద్య, వైద్యం రెండూ ముఖ్యమని, సర్పంచులు వీటి పై దృష్టి సారించాలని కోరారు. పిల్లలు చదువుకోవడానికి ప్రశాంత వాతావరణం కల్పించాలని తల్లిదండ్రులను ఉద్దేశించి అన్నారు. తల్లిదండ్రుల కష్టం విలువను పిల్లలకు తెలిసేలా పెంచాలని సూచించారు.

సర్పంచులు అందరూ నడుం బిగించి గ్రామాల్లో మంచి పర్యావరణం తీసుకువచ్చి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు.నా కుటుంబం నిరుపేద కుటుంబం. నేను కట్టిన అత్యధిక యూనివర్సిటీ ఫీజు రూ.600 మాత్రమే. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను అని ఆమె తెలిపారు. రైతులు తగు జాగ్రత్తలు పాటించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. సర్పంచుల సమస్యలను అధికారులకు చేరవేయడానికి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని తహసీల్దారు ను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande