
హైదరాబాద్, 16 ఏప్రిల్ (హి.స.) శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వేదికగా జరుగుతున్న అక్రమ కరెన్సీ రవాణాకు కస్టమ్స్ (Customs) అధికారులు మరోసారి బ్రేక్ వేశారు. హాంకాంగ్ కు అక్రమంగా విదేశీ కరెన్సీని తరలిస్తున్న(Foreign Currency) ఓ ప్రయాణికుడిని అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హాంకాంగ్ (Hong Kong)కు వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు, అతడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సదరు ప్రయాణికుడి వద్ద ఎటువంటి అనుమతులు లేని సుమారు రూ.45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు గుర్తించారు. బ్యాగుల్లో అత్యంత చాకచక్యంగా దాచి తరలించే ప్రయత్నం చేసినట్లుగా సమాచారం. పట్టుబడిన నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, విదేశీ కరెన్సీ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అంత భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు..? దీని వెనుక ఏదైనా హవాలా ముఠా ఉందా? అనే కోణంలో అధికారులు సదరు ప్రయాణికుడిని విచారిస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు