సమగ్ర అభివృద్ధి పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. కల్వకుర్తి ఎమ్మెల్యే
సమగ్ర అభివృద్ధి పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
MLA


నాగర్ కర్నూల్, 16 ఏప్రిల్ (హి.స.)

పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు అందించే పథకాలు అర్హులైన ప్రతి పేదవారికి అందజేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం కడ్తాల్ మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మండల సభలో పాల్గొన్న ఎమ్మెల్యే పార్టీలకు మాట్లాడుతూ...నియోజకవర్గ వ్యాప్తంగా అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వాలు అందించే పథకాలు అందించేందుకు కృషి చేస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పేదల సంక్షేమం, సమగ్ర అబివృదే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నామని, రానున్న రోజులో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేంచేందుకు కృషి చేస్తామన్నారు. సర్పంచులు గ్రామాల్లోని సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, విద్యుత్ తో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు సంబంధించిన 36 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అధికారుల, నాయకుల చేతుల మీదుగా అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande