
కర్నూలు, 21 ఏప్రిల్ (హి.స.)వేడితాపాన్ని తగ్గించి శరీరానికి చలువచేసే నవారా పిండి జావ. ఈ కాంబోలో ఒకసారి తాగితే మళ్లీ మళ్ళీ చేసుకుని మరి తాగుతారు. మీరు తాగిన తర్వాత మందులు జోలికేపోరు జీవితకాలం ఆరోగ్యంగా ఉంటారు.
నవారా బియ్యం పిండి, రాగి జావకు జావ కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు నవార బియ్యం పిండి, రెండు నుంచి మూడు గ్లాసులు నీళ్ళు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చి మిర్చి, అర కట్ట కొత్తిమీర, నాలుగు కరివేపాకు , జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.
ముందుగా రాగులు, నవర బియ్యాన్ని తీసుకుని దానిని పిండిలాగా చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అలాగే, వీటిని కూలింగ్ వాటర్ తో ఉండలు లేకుండా మెత్తగా అయ్యేలా చేసుకోవాలి. ఎందుకంటే, ఇది ఉరికే గట్టి పడుతుంది.
గ్యాస్ వెలిగించి నీరు మరిగించాలి. నీరు మరిగిన తర్వాత మీడియం మంట పై దానిని కలుపుతూ అలాగే పిండిని కూడా కొద్దీ కొద్దిగా పోస్తూ ఇంకో చేతితో బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా చేయడం వలన మెత్తగా అవుతుంది. చివర్లో నెయ్యి వేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబోలో ఒకసారి తాగితే మళ్లీ మళ్ళీ చేసుకుని మరి తాగుతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV