
చెన్నై, 21 ఏప్రిల్ (హి.స.)
తమిళనాడు రాజకీయ రణరంగంలో ఇప్పుడు అసలైన వేడి మొదలైంది. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం నేడు సాయంత్రంతో ప్రచారం ముగుస్తోంది. ఈ తరుణంలో, టీవీకే అధినేత విజయ్ తమిళ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనను ఎన్నో శక్తులు అడ్డుకోవాలని చూశాయని, కానీ తాను ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తమిళ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు.
ఫాసిస్టు మనస్తత్వం ఉన్న పార్టీలు లేదా అధికారంతో బెదిరించే శక్తులకు తాను భయపడనని, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న డీఎంకే, విధానపరమైన వైరుధ్యాలున్న బీజేపీ వంటి పార్టీలు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi