హర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు
డిల్లీ, 22 ఏప్రిల్ (హి.స.)పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ ముదిరేలా కనిపిస్తోంది. హర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒమన్ వైపు వెళ్తున్న నౌకలపై ఇరాన్ దాడులకు దిగింది. అలాగే భారత్కు చెందిన నౌకను సైతం దిగ్బంధించినట్లు సమాచారం అందుతోంది. అమెర
ship


డిల్లీ, 22 ఏప్రిల్ (హి.స.)పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ ముదిరేలా కనిపిస్తోంది. హర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒమన్ వైపు వెళ్తున్న నౌకలపై ఇరాన్ దాడులకు దిగింది. అలాగే భారత్కు చెందిన నౌకను సైతం దిగ్బంధించినట్లు సమాచారం అందుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.

జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని ఇరాన్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అమెరికా మాత్రం స్వేచ్ఛా రవాణాకు ఆటంకం కలిగించొద్దని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో బుధవారం హర్ముజ్లో వెళ్తున్న కంటైనర్ షిప్లపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డు నౌకలు కాల్పులు జరిపాయి. ఈ దాడుల్ని బ్రిటన్ ఆర్మీ ధృవీకరించింది. మొత్తం మూడు నౌకలపై దాడులు జరిగాయని.. గ్రీక్, పనామా, లైబీరియా రిజిస్ట్రేషన్ నౌకలుగా వాటిని గుర్తించారు.

తొలుత.. ఈ ఉదయం గ్రీక్ ఆపరేటెడ్ కంటైనర్ షిప్పై ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే ఇరాన్ బలగాలు కాల్పులకు దిగాయి. దీంతో నౌక పూర్తిగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని.. సిబ్బంది క్షేమంగానే ఉన్నారని సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande