
ముంబై, 22 ఏప్రిల్ (హి.స.)దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. గత మూడు రోజులుగా కొనసాగుతున్న సానుకూల ధోరణికి బ్రేక్ వేస్తూ బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. నేటి ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 756 పాయింట్లు పతనమై 78,516 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 24,378 వద్ద ముగిసింది.
విశ్లేషకుల అంచనా ప్రకారం పతనానికి కారణాలు
ముదురుతున్న అనిశ్చితి
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. అమెరికా విధించిన ఆంక్షలు, ఇరాన్ ప్రతిచర్యల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి మూతపడటం చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మార్గం గుండానే ప్రపంచంలోని 20% చమురు రవాణా జరుగుతుంది. తాజా దాడుల వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళన నింపడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు