ఆన్లైన్ గేమర్లకు BIG అలర్ట్.. కేంద్రం కీలక ఉత్తర్వులు
హైదరాబాద్, 22 ఏప్రిల్ (హి.స.) ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని క్రమబద్ధీకరించే లక్ష్యంతో రూపొందించిన ''ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, 2025'' నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ నిబంధనలు మే 1 నుండి అమలులోకి రానున్నాయి. ఆన్లై
Online


హైదరాబాద్, 22 ఏప్రిల్ (హి.స.)

ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని క్రమబద్ధీకరించే లక్ష్యంతో రూపొందించిన 'ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, 2025' నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ నిబంధనలు మే 1 నుండి అమలులోకి రానున్నాయి. ఆన్లైన్ సోషల్ గేమ్స్ ఆడేవారు లేదా నిర్వహించేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని ప్రభుత్వం స్వచ్ఛందంగా ఉంచింది. అంటే ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా'(OGAI) నుంచి ముందస్తు అనుమతి లేకుండానే ఈ గేమ్లు నడపవచ్చని పేర్కొంది. అయితే, ఏదైనా గేమ్ను సమీక్షించే అధికారం అథారిటీకి ఉంటుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆన్ లైన్ గేమింగ్ అథారిటీ ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 'ఆన్ లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా' పేరుతో ఆరుగురు అధికారులతో అథారిటీని ఏర్పాటు చేస్తూ ఇవాళ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ గెజిట్ విడుదల చేసింది. ఈ అథారిటీకి చైర్మన్ గా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అదనపు కార్యదర్శి, ఎక్స్ అఫిషియో సభ్యులుగా హోంశాఖ సంయుక్త కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి, సమాచార, ప్రసార శాఖ సంయుక్త కార్యదర్శి, యువజన, క్రీడల మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి, న్యాయశాఖ సంయుక్త కార్యదర్శిలను నియమించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande