గణేకల్: గొడ్డలితో వ్యక్తిపై దాడి – పరిస్థితి విషమం
గణేకల్: గొడ్డలితో వ్యక్తిపై దాడి – పరిస్థితి విషమం
ganekal-man-attacked-with-axe-condition-critical-


ఆదోని, 29 ఏప్రిల్ (హి.స.)ఆదోని మండలం గణేకల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డిపై వెంకటేష్ అనే వ్యక్తి గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

కుక్కను తోలేందుకు బయటకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగినట్లు బాధితుని భార్య రామలింగమ్మ తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హనుమంత్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.

అర్ధరాత్రి కావడంతో రవాణా సౌకర్యం లేక బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించలేకపోయారు. ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి తీవ్రంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande