
నంద్యాల, 29 ఏప్రిల్ (హి.స.) నషా ముక్త్ భారత్ ద్వారా యువతకు అవగాహన కల్పించి జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చి దిద్దడమే లక్ష్యమని కలెక్టర్ కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు.
నంద్యాల జిల్లాను ప్రమాద రహితంగా మార్చేందుకు కలెక్టర్ జి. రాజకుమారి, ఎస్పీ సునీల్ షొరాణ్ ఆధ్వర్యంలో బ్లాక్ స్పాట్ యాత్ర ప్రారంభమైంది. జిల్లాలో 29 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, నెలరోజుల్లో వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. వేగ నియంత్రణ, సీసీటీవీలు, లైటింగ్ వంటి భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.
అదేవిధంగా కలెక్టర్ మాట్లాడుతూ యువకులు ఎక్కువగా ఆల్కహాల్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని, దీని వల్ల వారి భవిష్యత్ దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మత్తుపదార్థాల దుష్ప్రభావాలను వివరిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్కు బానిసైన వారికి పునరావాసం కల్పించేందుకు డి- అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి, సైక్రియాట్రిస్టుల ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV