కడప జిల్లాలో ఘోరం.. తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు
కడప జిల్లాలో ఘోరం.. తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు
కడప జిల్లాలో ఘోరం.. తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు


కడప, 29 ఏప్రిల్ (హి.స.)

కడప జిల్లా చాపాడు మండలంలోని ఓబుల్రెడ్డి పేటలో ఒక దారుణ హత్య చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్నతల్లిని వేధిస్తున్నాడనే కోపంతో, ఒక 16 ఏళ్ల బాలుడు తన తండ్రిని కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

గ్రామానికి చెందిన బాధిత వ్యక్తి కొంతకాలంగా మద్యానికి బానిసై, నిత్యం ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే గత రాత్రి కూడా మద్యం సేవించి వచ్చి భార్యను వేధించడమే కాకుండా దాడికి పాల్పడ్డాడు. కళ్లముందే తండ్రి తల్లిని వేధిస్తుండటం చూసి తట్టుకోలేకపోయిన మైనర్ కుమారుడు ఆవేశానికి లోనయ్యాడు. ఇంట్లోని కత్తిని తీసుకుని తండ్రిపై దాడి చేయడంతో, తీవ్ర గాయాలైన తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న చాపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడైన 16 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలు, మద్యపాన వ్యసనం కారణంగానే ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande