తిరుమల అప్డేట్..31 కంపార్ట్మెంట్లలో వేచిఉన్న భక్తులు
తిరుమల అప్డేట్..31 కంపార్ట్మెంట్లలో వేచిఉన్న భక్తులు
తిరుమల


తిరుమల , 29 ఏప్రిల్ (హి.స.)

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి (Tirumala Tirupati)లో భక్తుల రద్దీ (Crowd of devotees) కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. వేసవి సెలవుల రద్దీ ప్రారంభంతో తిరుమలలో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి, భక్తులు వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అలాగే సర్వదర్శనం భక్తులతో నారాయణగిరిలోని షెడ్లు కూడా నిండిపోయాయి. దీంతో టోకెన్లు లేని (సర్వదర్శనం) భక్తులకు స్వామివారి దర్శనం కోసం సుమారు 12 నుంచి 14 గంటల సమయం పడుతోంది.

ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజే 68,980 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకునే క్రమంలో 26,511 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.09 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. రద్దీ దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ నిరంతరాయంగా పాలు, తాగునీరు మరియు అన్నప్రసాద వితరణ చేస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande