పుట్టపర్తిలో ఏఎంసీఏ సెంటర్ కు ఈ నెల 15, న శంకుస్థాపన
పుట్టిపర్తి 13 మే (హి.స.) పుట్టిపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఏయిర్ క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు ఈ నెల 15న శంకుస్థాపన జరగనుంది. ఈ కేంద్రం డీఆర్డీవో, ఏడీఏ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ కేంద్రంలో స్టెల్త్ ఫైటర్స్ అసెంబ్లింగ్, టెస్ట
పుట్టపర్తిలో ఏఎంసీఏ సెంటర్ కు ఈ నెల 15, న శంకుస్థాపన


పుట్టిపర్తి 13 మే (హి.స.)

పుట్టిపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఏయిర్ క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు ఈ నెల 15న శంకుస్థాపన జరగనుంది. ఈ కేంద్రం డీఆర్డీవో, ఏడీఏ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ కేంద్రంలో స్టెల్త్ ఫైటర్స్ అసెంబ్లింగ్, టెస్టింగ్ నిర్వహిస్తారు. ఏఎంసీఏ ఫైట్ టెస్టింగ్ సెంటర్పై ఎక్స్లో మంత్రి లోకేశ్ చేసిన పోస్టు నెటిజన్లను ఆకర్షిస్తోంది. రాయలసీమలో ల్యాండ్ అయిన ఫైటర్ జెట్ పైలెట్కి లోకేశ్ సెల్యూట్ చేస్తున్నట్లు ఉన్న వీడియోకి.. ‘పుట్టపర్తికి ఈ నెల15న ఏం వస్తుందో ఊహించండి’ అంటూ క్యాప్షన్ను జోడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande