
కర్నూలు, 13 మే (హి.స.)
: సహజ సిద్ధంగా పెరిగిన పండ్లను ప్రజలు సేవించాలని కెమికల్స్ వాడి మగ్గిచిన పండ్లను తినడం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ రావు తెలిపారు. కర్నూలు లోని మండి (mandi )మార్కెట్ లో కన్జ్యూమర్ ఫోరం అధికారులతో కలిసి పండ్ల గోడౌన్ ను తనిఖీ చేశారు. రాష్ట్ర కాల్సియం కార్బిట్ నిషేధం ఉందని, కాల్షియం కార్బిట్ వాడి పండ్లను మగ్గించి విక్రయాలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని, కొన్ని శాంపిల్స్ సేకరించమని రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉంటాయని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ తెలిపారు. ప్రజలు కూడా కెమికల్స్ వాడిన పండ్లు కాకుండా నాచురల్ గా పండించిన పండ్లు తినడం ద్వారా వారి ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుందని రైతులకు వ్యాపారులకు ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటించే విధంగా అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV