
అనంతపురం, 13 మే (హి.స.) అనంతపురం జిల్లా పామిడి మండలంలోని రామగిరి ఎగువ తాండలో [సేవాలాల్ మహారాజ్], మారెమ్మ తల్లి దేవాలయ నవనిర్మాణ పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా బంజారా (లంబాడా) ప్రజల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయాలను పలు ప్రాంతాలలో పునర్నిర్మిస్తున్నారు. ఈ ఆలయాల కోసం ప్రభుత్వాలు స్థలాలు, నిధులు కేటాయిస్తూ, భక్తులు కూడా భారీగా విరాళాలు అందిస్తున్నారు
అనంతపురం జిల్లా పామిడి మండలం రామగిరి ఎగువ తాండ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి సేవాలాల్ మహారాజ్ మరియు శ్రీ మారెమ్మ తల్లి దేవాలయం పూజ కార్యక్రమంలో మాజీ గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నూతన దేవాలయం నిర్మాణం కొరకు 5000 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి ఆరాధ్య దైవం, గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఆయన జయంతి వేడుకలను (ఫిబ్రవరి 15) ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు.ఈ ఆలయ నిర్మాణాల ద్వారా బంజారా సంస్కృతిని, సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను విస్తృతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV