సూపర్ సిక్స్ నుంచి యుద్ధ విమానాల దాకా కూటమి సర్కార్ స్పీడ్ ఇదే
సూపర్ సిక్స్ నుంచి యుద్ధ విమానాల దాకా కూటమి సర్కార్ స్పీడ్ ఇదే
minister-nara-lokesh-anantapur-visit-schedule-150774


అనంతపురం, 13 మే (హి.స.)

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 14, 15 తేదీల్లో మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనకు రానున్నారని తెలిపారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిని మంత్రి సందర్శించనున్నారని, అనంతరం అనంతపురంలో కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ నిలిచిపోయిందని, వైసీపీ నాయకుల నిర్లక్ష్యం వల్ల ఆర్డీటీ సేవలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.

అనంతరం యువగళం పాదయాత్రలో మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ స్థాయిలో కృషి చేసి ఎఫ్సీఆర్ఏ అనుమతులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అందుకే ఆయనకు ఘన స్వాగతం పలకడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో జిల్లాకు తొలిసారి వస్తున్న మంత్రి లోకేష్కు భారీ స్వాగతం ఇవ్వబోతున్నామని దగ్గుపాటి అన్నారు. ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన తనను ఎమ్మెల్యేగా నిలబెట్టింది సీఎం నారా చంద్రబాబు నాయుడు,మంత్రి లోకేష్, తెలుగుదేశం పార్టీనేనని చెప్పారు.గతంలో ఎప్పుడూ లేని విధంగా 23 వేల మెజార్టీ ఇచ్చి ప్రజలు నన్ను ఆశీర్వదించారని తెలిపారు.

మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో విధ్వంసక పాలన చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులను చక్కదిద్ది ఎన్నికల హామీలను అమలు చేస్తోందన్నారు. మెగా డీఎస్సీ, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు వంటి నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన రోజే ప్రతి విద్యార్థికి “తల్లికి వందనం” కింద రూ.15 వేల సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. “స్త్రీ శక్తి” ద్వారా మహిళలకు కోట్లాది ఉచిత ప్రయాణాలు కల్పించామని, “దివ్యాంగ శక్తి” ద్వారా దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande