పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగసామి ప్రమాణం- ఐదోసారి సీఎంగా బాధ్యతలు
పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగసామి ప్రమాణం- ఐదోసారి సీఎంగా బాధ్యతలు
ranga swamy


పుదుచ్చేరి, 13 మే (హి.స.)

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరింది. ఎన్డీఏ కూటమిలోని ఆల్ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ) అధినేత ఎన్ రంగసామి ఐదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. లోక్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కే కైలాస్నాథన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు ఇద్దరు మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఎంపీ మన్సుఖ్ మాండవీయా, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande