తిరుమల అప్ డేట్స్: 24 కంపార్ట్మెంట్లలో వేచిఉన్న భక్తులు
తిరుమల అప్ డేట్స్: 24 కంపార్ట్మెంట్లలో వేచిఉన్న భక్తులు
తిరుమల


తిరుమల, 13 మే (హి.స.)

వేసవి సెలవులతో తిరుమల క్షేత్రం (Tirumala Kshetra)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 24 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో దర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి సుమారు 14 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుండటంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం రోజున మొత్తం 80,389 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, వారిలో 32,213 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.50 కోట్లుగా నమోదైందని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదం మరియు తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande