మహిళల అభ్యున్నతి కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు.. మంత్రి అడ్లూరి
మహిళల అభ్యున్నతి కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు.. మంత్రి అడ్లూరి
Minister


హైదరాబాద్, 14 మే (హి.స.)

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, మహిళా ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన వీరవనిత చాకలి ఐలమ్మ మనుమరాలు చిట్యాల శ్వేత రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులు కావడం గర్వకారణమని మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర మహిళా కమిషన్లో సభ్యురాలిగా నియమితులైన నల్గొండ జిల్లాకు చెందిన చిట్యాల శ్వేత ఇవాళ హైదరాబాద్లోని మంత్రుల సముదాయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిశారు. సామాజిక న్యాయం, మహిళా హక్కుల పరిరక్షణ కోసం పోరాడిన కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆమె సమాజ సేవలో మరింత ముందుకు సాగాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత, గౌరవం, సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళా కమిషన్ మహిళల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, చట్టపరమైన సహాయం అందించడంలో కీలక భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు.

సీఎ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మహిళలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలు, అణగారిన వర్గాలకు చెందిన మహిళల సమస్యల పరిష్కారంపై మహిళా కమిషన్ దృష్టి సారించాలని మంత్రి సూచించారు. మహిళల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం, వేధింపులు, వివక్షకు గురైన బాధిత మహిళలకు తక్షణ సహాయం అందించడం వంటి అంశాల్లో కమిషన్ మరింత చురుకుగా వ్యవహరించాలని అన్నారు. అలాగే మహిళలపై జరుగుతున్న సామాజిక, ఆర్థిక, మానసిక వేధింపుల నిర్మూలనకు ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు స్వయం సమృద్ధితో ముందుకు సాగేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande