
ఖమ్మం, 14 మే (హి.స.) ఖమ్మం జిల్లా
ఏదులాపురం మున్సిపాలిటీలో గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను స్వయంగా వినిపించుకుని సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు త్వరలోనే శుభవార్త అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన పై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.
సంబంధించిన త్వరలో పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు వెలువడనున్నాయని, యువత అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే 75 వేల ఉద్యోగాలకు పైగా నిరుద్యోగ యువతకు ఇచ్చామని, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు పని చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజా దర్బార్కు వచ్చిన ప్రతి సమస్యను సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు