సిరిసిల్లలో హై టెన్షన్.. బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ
సిరిసిల్లలో హై టెన్షన్.. బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ
Sircilla


రాజన్న సిరిసిల్ల, 18 మే (హి.స.)

సిరిసిల్లలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. సోమవారం ఇరు పార్టీలు నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ నాయకులు.. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ నాయకులు పరస్పర నినాదాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. పరిస్థితులు చేతులు దాటుతుండడంతో జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతేతో సహా భారీగా పోలీసు బలగాలు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘర్షణలో ఇరు పార్టీల నాయకులలో కొందరికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande