
కరీంనగర్, 18 మే (హి.స.)
వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో అధికారులు అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లర్ అసోసియేషన్, లారీ అసోసియేషన్ ప్రతినిధులు ధాన్యం కొనుగోలు వేగవంతంగా పూర్తయ్యేలా సహకరించాలి అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు రాకుండా నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అని అన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరగడానికి మొత్తం వ్యవస్థ పని చేస్తుంది అని అధికారులు ధాన్యం కొనుగోలులో నిమగ్నమై ఉండాలి అన్నారు. కరీంనగర్ జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నులు అంచనా వేశాం.. 314 ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఇప్పటికే 3 లక్షల మెట్రిక్ ధాన్యం వచ్చిందని తెలిపారు. జిల్లాకి నిర్దేశించిన లక్ష్యంగా ధాన్యం సేకరణ 100 శాతం పూర్తిచేయాలి అని అన్నారు.
ఇప్పటి వరకు 1.58 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తి చేశాం అని మిగిలిన 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సేకరించిన ధాన్యంలో 63 శాతం 237.39 కోట్లు బ్యాంకుల ద్వారా పేమెంట్ జరిగింది అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తుంది. అని మిల్లులు, లారీలు యజమానులు సహకరించాలి అని కోరారు. ధాన్యం అనుగుణంగా లారీల సంఖ్య పెంచాలి అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల వద్ద హామలీల కొరత లేకుండా చూసుకోవాలి అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుకు ధాన్యం తెచ్చి రోజుల తరబడి ఉండడం వల్ల రైతులకు ఇబ్బందులు వచ్చాయి అని ధాన్యం కొనుగోలు లో హామలీల కొరత లేకుండా చూసుకోవాలి అన్నారు. సహకార సంఘాల సెంటర్ల సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల ఆ సెంటర్లో ఇబ్బందులు వస్తున్నాయి అన్నారు. మహిళా సెంటర్లను ఎంకరేజ్ చేసేలా.. ఐకేపీకి ఇస్తే ఇబ్బందులు రావు అన్నారు. జిల్లాలో రోజుకు 150 లారీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా.. మిల్లుల్లో ఒక రోజులో అన్ లోడింగ్ పూర్తి చేస్తే రవాణా ఇబ్బందులు ఉండకపోయేవి అని మిల్లులో రెండు రోజుల పాటు లారీలు ఆగి ఉండడం వల్ల లారీలు ఆగుతున్నాయి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు