తిరుమలలో భక్తుల రద్దీ.. కంపార్టుమెంట్లలో భక్తుల నిరీక్షణ
తిరుమలలో భక్తుల రద్దీ.. కంపార్టుమెంట్లలో భక్తుల నిరీక్షణ
తిరుమల


తిరుమల, 18 మే (హి.స.)

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ఆదివారం స్వామివారిని 91,020 మంది భక్తులు దర్శించుకోగా.. 35,193 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. వరుసగా రెండోరోజు 90 వేల మందికిపైగా భక్తులు స్వామివారి దర్శనానికి రాగా.. వారందరికీ అన్నపానీయాలకు లోటులేకుండా చూశామని టీటీడీ పేర్కొంది. రెండ్రోజుల్లో 1.81 లక్షల మందికి స్వామివారి దర్శనం కల్పించామని వెల్లడించింది. నిన్న ఒక్కరోజే భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

మరోవైపు తిరుమల వెళ్లే భక్తులకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. చర్లపల్లి నుంచి తిరుచానూర్ వరకూ నూతన రైలును ఏర్పాటు చేయగా.. దానిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను ఆధునికీకరణ చేస్తున్నామని, రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande