
మెదక్, 18 మే (హి.స.)
రైతులు ఆరు కాలం, శ్రమించి, కష్టించి, పండించిన పంటను కొనాలంటూ రైతులు రోడ్డెక్కారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ఐకెపి, పిఎసిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో రెండు కేంద్రాలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు విమర్శించారు. ధాన్యాన్ని కొనాలని రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనాలంటూ డిమాండ్ చేస్తూ.. మెదక్ - గజ్వేల్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు వద్ద ఇబ్బంది పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ధర్నాలు వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. హమాలీలు, గన్ని బ్యాగుల కొరత తీవ్రంగా వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు సరిగా జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. గన్ని బ్యాగులు, లారీలు లేకపోవడం వల్ల ఎక్కడికక్కడే ధాన్యం కుప్పలు పేరుకు పోతున్నాయని, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. సొసైటీ అధికారులు, పాలకవర్గం పట్టించుకున్న పాపనా పోలేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు