
సంగారెడ్డి, 18 మే (హి.స.)
సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు
బాలురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం రామోజీపల్లిలో జరిగింది. ఎస్ఐ చైతన్య కిరణ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామోజీ పల్లి గ్రామానికి చెందిన రాయిపల్లి చంద్రయ్య కుమారుడు నిరంజన్(12) అదే గ్రామానికి చెందిన మున్నూరు కాపు బస్వరాజు(10), మున్నూరు కాపు మనోజ్(12) ముగ్గురు కలిసి ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రామ సమీపంలోని నల్లవాగుకు ఈతకు వెళ్లారు.
ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు రాత్రి 8 అవుతున్న ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకొని నల్లవాగులో గాలింపు చర్యలు చేపట్టారు. చాలా సేపటికి ముగ్గురి మృతి దేహాలు లభ్యం అయ్యాయి. ఈ ఘటనపై రాయికోడ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కొరకు జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఒకే గ్రామంలో ముగ్గురు పిల్లలు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు