శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన వెంకటేశ్వర జ్యువెలరీ షాపులో చోరీ కేసును చేధించిన పోలీసులు
శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన వెంకటేశ్వర జ్యువెలరీ షాపులో చోరీ కేసును చేధించిన పోలీసులు
శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన  వెంకటేశ్వర జ్యువెలరీ షాపులో చోరీ కేసును చేధించిన పోలీసులు

శ్రీకాకుళం, 02 మే (హి.స.)

శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన కాశీబుగ్గ వెంకటేశ్వర జ్యూవెలరీ షాపులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 243 గ్రాముల బంగారం, 2 పిస్టల్స్, 4 కార్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిందితులంతా ఒడిశా రాష్ట్రానికి చెందినవారని పేర్కొన్నారు. పొట్నూరు తిరుమల పాత్రో సహకారంతో దోపిడికి ముందు రెండు సార్లు నిందితులు పలాసలో రెక్కీ నిర్వహించారని చెప్పారు. ఒడిశా జైలు లో పరిచయమైన యూపీకి చెందిన ముఠాతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడ్డారని వెల్లడించారు. దోపిడీ చేసిన మిగతా బంగారంతో పాటు యూపీ గ్యాంగ్ను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande