
నల్గొండ, 02 మే (హి.స.)
నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశంలో బెల్ట్ షాపుల నిర్మూలన పై కీలక నిర్ణయం తీసుకుంది. మండల కేంద్రంలో అక్రమంగా నిర్వహిస్తున్న అన్ని బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామపంచాయతీ పరిధిలో ఎవరైనా బెల్టుషాపులు నిర్వహిస్తే వారికి రూ.25,000 జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ తీర్మానాన్ని ఉల్లంఘించిన వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామంలో శాంతి భద్రతలు, కుటుంబాల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సభ్యులు తెలిపారు. గ్రామ ప్రజలు కూడా సహకరించి బెల్ట్ షాపుల నిర్మూలనకు తోడ్పడాలని కోరారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు