నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి : జోగులాంబ కలెక్టర్
జోగులాంబ గద్వాల, 02 మే (హి.స.) మే 3వ తేదీ (ఆదివారం) నిర్వహించనున్న నీట్ యూజీ- 2026 పరీక్షకు నిషేధిత వస్తువులను అనుమతించడం జరగదని, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 04 పరీక్షా కేంద్రాల్లో
Collector


జోగులాంబ గద్వాల, 02 మే (హి.స.)

మే 3వ తేదీ (ఆదివారం)

నిర్వహించనున్న నీట్ యూజీ- 2026 పరీక్షకు నిషేధిత వస్తువులను అనుమతించడం జరగదని, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 04 పరీక్షా కేంద్రాల్లో సుమారు 936 మంది అభ్యర్థులు హాజరవుతున్న నేపథ్యంలో పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. విద్యార్థులు ఎన్డీఎ నిబంధనల మేరకు నిషేధిత వస్తువుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, నిబంధనల ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, బ్లూటూత్, ఇయర్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఎలాంటి స్టేషనరీ వస్తువులను (పెన్ డ్రైవ్లు, కాలిక్యులేటర్లు, ప్యాడ్లు) అనుమతించబోమని స్పష్టం చేశారు. అలాగే వాలెట్లు, హ్యాండ్ బ్యాగులు, బెల్టులు, టోపీలు, చేతి గడియారాలు, లోహపు ఆభరణాలను అభ్యర్థులు ధరించకూడదని సూచించారు. కేవలం పారదర్శకమైన నీటి సీసాను మాత్రమే అనుమతిస్తామని, ఆహార పదార్థాలకు అనుమతి లేదని సూచించారు. అభ్యర్థులు తమ వెంట తెచ్చుకునే వస్తువుల పట్ల కేంద్రాల నిర్వాహకులు ఎలాంటి బాధ్యత తీసుకోరని, కావున కేంద్రాల వద్ద నిషేధించిన వస్తువులను ఇంటి వద్దే వదిలి రావాలని సూచించారు. ఎవరైనా అభ్యర్థి నిబంధనలకు విరుద్ధంగా వస్తువులతో పట్టుబడితే, వారిని పరీక్షకు అనర్హులుగా ప్రకటించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande