
అమరావతి, 02 మే (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిఅభివృద్ధిలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలోని క్వాంటం వ్యాలీలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించతలపెట్టిన ట్విన్ ఆఫీస్ టవర్ల నిర్మాణానికి అధికారికంగా పరిపాలన అనుమతులు లభించాయి. రాజధాని నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలనా యంత్రాంగానికి అవసరమైన కార్యాలయాల కోసం ఈ ట్విన్ టవర్లను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది. ట్విన్ టవర్ల (T1 & T2) 'షెల్ అండ్ కోర నిర్మాణ పనుల కోసం రూ. 1208.41 కోట్లు కేటాయిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల (ఏప్రిల్) 23వ తేదీన జరిగిన 60వ ఏపీసీఆర్డీఏ (APCRDA) అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నిధులను మంజూరు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ