ఎమ్మెల్యేలకు విలువ లేకుండా చేస్తున్నారు.. అధికారుల తీరుపై మల్లారెడ్డి ఫైర్
మేడ్చల్ మల్కాజ్గిరి, 02 మే (హి.స.) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నేడు నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మేడ్చల్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని స్థానిక మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బై కాట్ చేశారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఉదయం 9
Malla Reddy


మేడ్చల్ మల్కాజ్గిరి, 02 మే (హి.స.) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నేడు నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మేడ్చల్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని స్థానిక మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బై కాట్ చేశారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఉదయం 9:30 కి కార్యక్రమం అన్నారు. ఇప్పటి వరకు ప్రజాపాలన కార్యక్రమం మొదలు పెట్టలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఎమ్మెల్యేలతో నిర్వహించాలి. కనీసం ఎమ్మెల్యేలకు విలువ లేకుండా చేస్తున్నారు అని అధికారుల తీరు పై మండిపడ్డారు. నేను లోకల్ ఎమ్మెల్యేను లబ్దిదారులకు నాలుగు ఐదు చెక్కులు అయినా ఇస్తా.. నాకు అనుమతి ఇవ్వండి అని అధికారులను అడిగాను.. కానీ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాటను కనీసం పట్టించుకోకుండా అధికారులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande