ధాన్యం కొనుగోలు జాప్యం పై రైతుల ఆగ్రహం.. జాతీయ రహదారిపై ధర్నా.
నిజామాబాద్, 02 మే (హి.స.) నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో 44వ జాతీయ రహదారి పై శివాలయం సమీపంలో ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా రైతులు శనివారం ఉద
రైతుల ధర్నా


నిజామాబాద్, 02 మే (హి.స.)

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్

నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో 44వ జాతీయ రహదారి పై శివాలయం సమీపంలో ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా రైతులు శనివారం ఉదయం ధర్నా నిర్వహించారు. వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మంచిదే అయినా, అక్కడ ఎలాంటి లావాదేవీలు జరగకపోవడంతో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సొసైటీకి చెందిన జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని, కేంద్రాన్ని ప్రారంభించి ఊరుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం, సొసైటీ అధికారుల తీరుపై మండిపడ్డారు. వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించి 15 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు రైస్ మిల్లులకు రైతుల ధాన్యాన్ని తరలించిన దాఖలాలు లేవని వాపోయారు. కొనుగోలు కేంద్రంలో కాంటా నిర్వహించి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించిన తర్వాత కూడా, లారీలలో ఉన్న లోడును మిల్లుల యజమానులు ఖాళీ చేయడం లేదని ఆరోపించారు.

వారం రోజులుగా రైతులు తమ వరి ధాన్యాన్ని కేంద్రం వద్ద ఉంచినా, ఎలాంటి తూకాలు జరగడం లేదని అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాల్లో చురుకుగా ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరింత ఉధృతంగా ధర్నా చేపడతామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande